తిరుమలలో చూడదగ్గ ప్రాంతాలు 1. వరహస్వామి ఆలయం : తిరుమల ఉత్తరమాడ వీధిలో వుంటుంది. మొదట వరహస్వామిని దర్శించి ఆ తర్వాత శ్రీవారిని దర్శించాలని స్థల పురాణం చెపుతోంది. 2. హథీరాం బావాజీ మఠం : శ్రీవారి ఆలయం ఎదురుగా వుంటుంది. దేవదేవుడితో పాచికలు ఆడిన భక్తుడు నడయాడిన స్థలం ఇది. 3. అనంతాళ్వార్ తోట : శ్రీవారికి పుష్పకైంకర్యం చేసే బాగ్యం పొందిన భక్తుడు నివశించిన స్థలం. క్యూకాంప్లెక్స్ వెళ్లే దారిలోనే వుంది. […]