Provide The Best Possible Services to Pilgrims On Garuda Seva day

Provide The Best Possible Services to Pilgrims On Garuda Seva day

Tirumala JEO Sri KS Sreenivasa Raju called upon the deputation staffs for Garuda Seva( October 14th ) during the ensuing Navarathri Brahmotsavams to provide best possible services to pilgrims with patience and dedication.

An orientation programme to the staffs was held at Conference Hall in TTD Administrative building in Tirupati on Monday. Speaking on this occasion, the JEO said, this year more crowd is being anticipated for Garuda Seva during Navarathri Brahmotsavams as it is falling on October 14 which is not only Sunday but coupled with Peratasi Masam which is auspicious to Tamil folk.

He said additional toilets have already been constructed in the four Mada streets in all galleries for the sake of pilgrims. The staffs deployed for gallery duty should properly guide the pilgrims on how to reach these toilets located in the galleries. Annaprasadam, buttermilk, water will be distributed to the 2lakh people converged in the galleries of four mada streets. The services of Srivari Sevakulu need to be utilized in the best way and for that, the concerned department should list out the sevakulu drafted for Garuda Seva service.

FACAO Sri Balaji, SEs Sri Ramesh Reddy, Sri Sudhakar Rao, Annaprasadam Special Officer Sri Venu Gopal, DFO Sri Phanikumar Naidu, Health Officer Dr Sermista were also present.

గరుడ వాహనం

గరుడసేవ రోజు భక్తులకు చక్కటి సేవలు అందించాలి : తిరుమల జెఈవో శ్రీ కెఎస్‌.శ్రీనివాసరాజు

తిరుమల, 2018 అక్టోబరు 08: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ నెల 14న జరిగే గరుడసేవకు వచ్చే భక్తులకు చక్కటి సేవలు అందించాలని తిరుమల జెఈవో శ్రీ కెఎస్‌.శ్రీనివాసరాజు ఉద్యోగులను కోరారు. తిరుపతిలోని టిటిడి పరిపాలన భవనంలోగల సమావేశ మందిరంలో డెప్యూటేషన్‌ ఉద్యోగులకు సోమవారం మధ్యాహ్నం అవగాహన సదస్సు నిర్వహించారు. పెరటాశి మాసం, దసరా సెలవుల నేపథ్యంలో గరుడసేవ రోజున భక్తుల రద్దీ మరింత అధికంగా ఉంటుందని, దీనికి తగ్గట్టు సిబ్బంది పని చేయాలని సూచించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ తిరుమలలో భక్తుల సౌకర్యార్థం నాలుగు మాడ వీధులలో ఇప్పటికే భక్తులకు అవసరమైన మరుగుదొడ్లను అందుబాటులోకి తీసుకు వచ్చామన్నారు. గ్యాలరీలలోని భక్తులు మరుగుదొడ్లకు ఎలా వెళ్లాలో సిబ్బంది ముందుగానే తెలియజేయాలన్నారు. తిరుమలలో వివిధ ప్రాంతాలకు వెళ్లే మార్గాలకు సంబంధించిన సూచికబోర్డులు సక్రమంగా ఉండేలా చూసుకోవాలన్నారు. అదేవిధంగా, తిరుమల నాలుగు మాడ వీధులలో 2 లక్షల మంది భక్తులు కూర్చునే విధంగా గ్యాలరీలు ఉన్నాయని, భక్తులందరికీ అన్నప్రసాదాలు, మజ్జిగ, తాగునీటిని సులభంగా అందించేందుకు వీలుగా ఏర్పాట్లు చేసుకోవాలని సంబంధిత అధికారులను జేఈవో ఆదేశించారు. నాలుగు మాడ వీధులలో ఏ ఏ ప్రాంతాలలో ఏంత మంది శ్రీవారి సేవకులు ఉండాలనే విషయంపై ముందుగానే లిస్ట్‌ తయారు చేసుకోవాలన్నారు. భక్తులతో సంయమనంతో మెలుగుతూ, చక్కటి సేవలు అందించాలని సిబ్బందికి జేఈవో సూచించారు.

ఈ కార్యక్రమంలో ఎఫ్‌ఏసిఏవో శ్రీ ఓ బాలాజీ, ఎస్‌ఈలు శ్రీ రమేష్‌ రెడ్డి, శ్రీ సుధాకర్‌రావు, అన్నప్రసాదం ప్రత్యేకాధికారి శ్రీ వేణుగోపాల్‌, డిఎఫ్‌వో శ్రీ ఫణికుమార్‌ నాయుడు, ఆరోగ్యశాఖాధికారి డా|| శర్మిష్ఠ ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Leave A Comment

Leave a Reply

More Updates