తిరుమలలో చూడదగ్గ ప్రాంతాలు? – Visiting Places Tirumala

తిరుమలలో చూడదగ్గ ప్రాంతాలు? – Visiting Places Tirumala

తిరుమలలో చూడదగ్గ ప్రాంతాలు

 

1. వరహస్వామి ఆలయం :

తిరుమల ఉత్తరమాడ వీధిలో వుంటుంది. మొదట వరహస్వామిని దర్శించి ఆ తర్వాత శ్రీవారిని దర్శించాలని స్థల పురాణం చెపుతోంది.

2. హథీరాం బావాజీ మఠం :

శ్రీవారి ఆలయం ఎదురుగా వుంటుంది. దేవదేవుడితో పాచికలు ఆడిన భక్తుడు నడయాడిన స్థలం ఇది.

3. అనంతాళ్వార్ తోట :

శ్రీవారికి పుష్పకైంకర్యం చేసే బాగ్యం పొందిన భక్తుడు నివశించిన స్థలం. క్యూకాంప్లెక్స్ వెళ్లే దారిలోనే వుంది.

 

తిరుమలకు నడకదారులు ఎన్నో మీకు తెలుసా?

 

4. అన్నమయ్య ఇల్లు :

వరహస్వామి ఆలయం వెనుక వుంటుంది.

5. తరిగొండ వేంగమాంబ సమాధి:

వరహస్వామి అతిథి గృహాల వెనుక వున్న ప్రైవేటు ఇంగ్లీషు మీడియం స్కూలులో వుంది.

 

Interesting Article:  Tirumala Package

 

6. ఎస్‌వి మ్యూజియం

(తిరుమల, తిరుపతి చరిత్రను తెలిపే ఎన్నో అంశాలున్నాయి. రెండు రూపాయల టిక్కెట్టు). ఉచిత దర్శనాల క్యూకాంప్లెక్స్ ఎదురుగా వుంది.

 

Kapila Theertham Temple Timings – History, Darshan, Tirupati

 

7. నారాయణ గిరి ఉద్యానవనం :

పద్మావతి పరిణయం, అన్నమయ్య వర్దంతి వంటి ఉత్సవాలు జరిగే విశాలమైన ఉద్యానవనం. పక్కనే ఆళ్వార్ తీర్థం చెరువు కూడా వుంటుంది.

పాపవినాశనం వెళ్లే బస్సు ఎక్కితే:

1. పాపవినాశనం (బస్టాండ్‌ నుంచి 8 కిలోమీటర్లు. బస్సు నేరుగా అక్కడికే పోతుంది)

2. ఆకాశగంగ (బస్టాండ్‌ నుంచి 5 కిలోమీటర్లు)

3. జాపాలి తీర్థం (పాపవినాశనం దారిలో ఉంది. ఆకాశగంగ దిగి కాసేపు నడచి వెళ్లాలి)

4. వేణుగోపాలస్వామిగుడి (బస్టాండ్‌ నుంచి 4 కిలోమీటర్లు) పాపవినాశనం వెళ్లే దారిలో బస్సు దిగి చూసి వచ్చేయవచ్చు.

Tirumala Tirupati Darshan Seva Room Online Booking

శిలాతోరణం రోడ్డులో వెళితే:

1. శిలాతోరణం (బస్టాండ్‌ నుంచి 3 కిలోమీటర్లు)

2. చక్రతీర్థం ( శిలాతోరణం పక్కనే కాసేపు నడిచి వెళ్లాలి)

3. శ్రీవారి పాదాలు (బస్టాండ్‌ నుంచి 5 కిలోమీటర్లు)

4. వేదపాఠశాల (బస్టాండ్‌ నుంచి 6 కిలోమీటర్లు) (నోట్: ప్రస్తుతం శిలా తోరణంకు ప్రస్తుతం ఆర్టీసీ బస్సులు లేవు. ప్రైవేటు జీపుల్లో వెళ్లాల్సిందే.

 

Leave A Comment

Leave a Reply

More Updates